• ప్రస్తుతం ఈ భాషా పరిశోధన కేంద్రంలో 40,000 తెలుగు పుస్తకాలు, 20,000 ఇంగ్లీషు పుస్తకాలు, 5,000 హిందీ పుస్తకాలు, 500 సంస్కృత గ్రంథాలు, 250 కన్నడ గ్రంథాలు, 250 తమిళ గ్రంథాలు, 50 ఉర్దూ గ్రంథాలు మొత్తం 66,050 పుస్తకాలు అందుబాటులో పెట్టాం. అలాగే 3,000 ప్రత్యేక సంచికలు, బాలల విభాగంలో 500 పుస్తకాలు ఉన్నాయి. మద్రాసులోని ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం నుండి 42 సంపుటాల మెకంజీ కైఫీయత్తుల ప్రతులను సేకరించాం. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంది తీసుకొచ్చిన 17 సంపుటాల సి.పి.బ్రౌన్‌ గ్రంథాలను కూడా సంపాదించాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సర్వీసులో పనిచేసిన శ్రీ జె.పి.ఎల్‌.గ్విన్‌ ఐ.సి.ఎస్‌. గారు ఉద్యోగవిరమణచేసి బ్రిటన్‌కు వెళ్ళిన తర్వాత సి.పి.బ్రౌన్‌ రచించిన ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుల తొలి ప్రతులను సంపాదించి పంపించారు. అలాగే ఆయన తన వంతుగా 1,115 రూపాయలు సహాయం చేశారు. సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో పరిశోధకులకు అందుబాటులో ఈ ఫై గ్రంథాలు లభిస్తాయి.
  • Read more

    • Notifications will be updated soon.
     
    satta king tw