సి.పి.బ్రౌన్‌ గారి తండ్రి డేవిడ్‌బ్రౌన్‌


ఛార్లెస్‌ ఫిలిప్‌బ్రౌన్‌ మహోదయలు :

సి.పి.బ్రౌన్‌ గారి సంతకంతో కూడిన ఆయన అభిప్రాయం:

  • 1798 నవంబరు 10 : రెవరెండ్‌ డేవిడ్‌ బ్రౌన్‌ ఫ్రాన్సిస్‌ కౌలే దంపతుల రెండో కుమారుడుగా జననం -కలకత్తాలో .
  • డిసెంబర్‌ 2 : బాప్టిజం (మతస్నానం).
  • 1812 జూన్‌ 14 : తండ్రి మరణం, తల్లి ఇతర కుటుంబ సభ్యులతో లండన్‌కు పయనం.
  • 1814 జనవరి 19 : హెయిల్‌బర్‌ కళాశాల ప్రవేశం, రెండేళ్ళ చదువు.
  • 1816 జూన్‌ 30 :రైటర్‌గా మద్రాసు సివిల్‌ సర్వీసులో ప్రవేశం.
  • 1817 ఆగస్టు 3,4 : మద్రాసులో అడుగు పెట్టడం.
  • ఆగస్టు 13 : ఫోర్ట్‌ సెయింట్‌ జార్జి కళాశాలలో ప్రవేశం, తెలుగు, మరాఠీ చదవటం.
  • 1820 జూన్‌ : కళాశాల నుండి ఉత్తీర్ణత, సర్‌ థామస్‌ మన్రో స్నాతకోపన్యాసంతో ప్రభావితుడు కావటం .
  • ఆగస్టు : కడప కలెక్టర్‌కు అసిస్టెంటుగా నియామకం .
  • 1821 : కడపలో రెండు ఉచిత పాఠశాలలను ప్రారంభించి, తెలుగు హిందుస్తానీ భాషలను బోధించడం.
  • 1822 : జిల్లా కోర్టు రిజిస్టర్‌ (రిజిస్ట్రార్‌)గా మచిలీపట్నంకు బదిలీ.
  • 1823 : జడ్జిగారి సెలవు ఖాళీలో తాత్కాలికంగా జడ్జి బాధ్యతలు, కోర్టు నాజర్‌తోసహా మరికొందరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయటం (తర్వాత ఈ సస్పెన్షన్‌ ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేయటం).
  • 1824: వేమనను గుర్తించటం, అబేదుబాయ్‌ రచించిన గ్రంథంలో వేమన ప్రస్తావన చూడడం, వేమన పద్యాల తాళపత్ర ప్రతుల సేకరణకు పూనుకోవటం, పద్యాలను చదివి అనువాదానికి ఉపక్రమించటం, పాఠ పరిష్కరణలోఎదురైన సమస్యల పరిష్కారం కోసం తెలుగు ఛందస్సు పట్ల అభిరుచి కలగటం.
  • 1825 : రాజమండ్రి కలెక్టరుకు హెడ్‌ అసిస్టెంటు, మేజిస్ట్రేట్‌గా బదిలీ. ఉప్పుదరోగా ఉద్యోగి గవర్రాజును లంచం తీసుకొన్నాడన్న నేరంపై బర్తరఫ్‌ చేయటం (తర్వాత ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దుచేసి, దరోగాను మళ్ళీ ఉద్యోగంలో నియమించటం.
  • 1825 డిసెంబర్ ‌: తెలుగు ఛందోగ్రంథం వ్రాతప్రతిని ప్రచురణార్థం మద్రాసు కాలేజి బోర్డుకు సమర్పించటం.
  • 1826:కడప జిల్లా కోర్టు రిజిస్టర్‌గా బదిలీ, కొంతకాలం అసిస్టెంట్‌ జడ్జి. జాయింట్‌ క్రిమినల్‌ జడ్జిగా పనిచేయటం, కంభంలోని ఆగ్జిలరీ కోర్టు జడ్జిగా వెళ్ళడం.
  • 1827 : తెలుగు ఛందస్సుపై అతని మొదటి పుస్తకం మద్రాసు కాలేజి ప్రెస్‌ నుంచి వెలువడటం. కాలేజి తెలుగుశాఖను, ప్రధానంగా తెలుగు సంప్రదింపు గ్రంథాలయాన్ని నెలకొల్పటం.
  • 1828 : కాలేజి ప్రింటింగు ప్రెస్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు చేయటం. కడపలో బంగళా కొనటం, ఆ బంగళాలో తాను సేకరించిన వ్రాతప్రతులతో గ్రంథాలయం నెలకొల్పటం, నేటివ్‌ పండితుల నివాసానికి, గ్రంథపరిష్కరణ శుద్ధ ప్రతులు తయారీ, కావ్యాలకు వ్యాఖ్యానాలు మొదలైన వాటికి సౌకర్యాలను ఆ బంగళాలో ఏర్పరచటం.
  • 1829:రెండో పుస్తకం వేమన పద్యాలు కాలేజి ప్రెస్‌ నుంచి వెలువడటం, తిరుచినాపల్లిలోని ప్రావిన్సియల్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్‌ అండ్‌ సర్క్యూట్‌కు రిజిస్ట్రార్‌గా ట్రికినోపొలికి బదిలీ. తెలుగు నిఘంటువు వ్రాతప్రతిని ప్రచురణ కొరకు కాలేజి బోర్డుకు పంపటం- వారు దానిని ఎటూ తేల్చక మూల వేయటం.
  • డిసెంబర్‌ 11: రాజమండ్రి అసిస్టెంట్‌ జడ్జి అండ్‌ జాయింట్‌ క్రిమినల్‌ జడ్జిగా బదిలి.
  • 1832 డిసెంబర్‌ :కరువు కాలంలో గుంటూరు జిల్లా యాక్టింగు జడ్జిగా నియామకం.
  • 1833 మార్చి 19 : చిత్తూరుజిల్లా జడ్జిగా బదిలీ - నెలలోపునే రాజమండ్రి అగ్జిలియరి కోర్టుకు బదిలీ - రాజమండ్రి-మచిలీపట్నం డివిజన్‌లో ఉద్యోగం. మచిలీపట్నంలో తెలుగు ముద్రణాశాల స్థాపించే ప్రయత్నం - జయప్రదం కాలేదు.
  • 1834 అక్టోబర్‌ : చట్ట సంబంధమైన సమస్యల వలయంలో ఇరుక్కొని, కొన్ని ఫోర్జరీలు కూట సాక్ష్యాల కేసులపై ఇచ్చిన తీర్పులు సరిగా లేవన్న కారణంగా 'డిస్మిస్‌' కావటం.
  • నవంబర్‌ 14: బ్రౌన్‌ తన డిస్మిసల్‌ ఉత్తర్వులపై చేసిన అపీలును తిరస్కరించటం. డిస్మిసల్‌ ఉత్తర్వులను ప్రభుత్వం ఖాయం చేయటం.
  • నవంబర్‌ 26: లండన్‌ కోర్టు ఆఫ్‌ డైరక్టర్స్‌కు - మళ్ళీ ఉద్యోగంలో నియమించే విషయంపై అపీలు.
  • డిసెంబర్‌ 2: మూడేళ్ళ సెలవు, ఏడాదికి 500 పౌండ్ల జీతంతో మంజూరు -ఇంగ్లండుకు ప్రయాణం.
  • 1835: లండన్‌లో తన తెలుగు వ్యాకరణం, తెలుగు నిఘంటువుల పని చూస్తూ తన ఎనిమిది సంపుటాల నిఘంటువు మొదటి వ్రాతప్రతి పూర్తి చేయటం. రాయల్‌ ఏషియాటిక్‌ సొసైటి వారికి రెండు ఆంధ్రవర్ణచిత్రాలను బహూకరించడం. ప్రొఫెసర్‌ రోసన్‌ సలహాపై సంస్కృత ఛందస్సుపై వ్రాసిన బ్రౌన్‌ వ్యాసం ఏషియాటిక్‌ జర్నల్‌ (1837)లో ప్రచురణ.
  • 1836: ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్‌ విల్సన్‌కు అతిథిగా ఉండటం. ఇండియా ఆఫీసు లైబ్రరీలో ఉన్న దక్షిణ భారతభాషల్లో వ్రాతప్రతుల పరిశీలన-విభజన, ముసాయిదా క్యాటలాగు తయారుచేసి ఇచ్చినందుకు 1837 మార్చిలో బోర్డు ఆఫ్‌ డైరక్టర్స్‌ బ్రౌన్‌కు తమ అభినందనలు తెలపటం.
  • 1837 ఆగస్టు: ఇండియాకు తిరుగు ప్రయాణం. ఓడలో కాల్డ్వెల్‌తో పరిచయం -ఆజీవమైత్రి ఏర్పడటం.
  • 1838 జనవరి 7: మద్రాసులో అడుగు పెట్టడం.
  • జనవరి 23: ప్రభుత్వానికి పర్షియన్‌ అనువాదకుడిగా నియమించబడటం.
  • మార్చి 2 : కాలేజి బోర్డు, నేటివ్‌ ఎడ్యుకేషన్‌ కమిటి యాక్టింగు సెక్రటరీగా నియామకం,కొత్త నిబంధనలు తెలుగు అనువాద ప్రతి ప్రచురణ.
  • 1839 జనవరి 22: మద్రాసులోని సదర్‌ అండ్‌ ఫౌజ్‌ అదాలత్‌ కోర్టులకు యాక్టింగు రిజిస్ట్రార్‌.
  • మే 20 :యాక్టింగు సూపరింటెండెంట్ ఆఫ్‌ గవర్నమెంట్‌ లాటరీస్‌ మద్రాసు జర్నల్‌ ఆఫ్‌ లిటరేచర్‌ అండ్‌ సైన్స్‌ పత్రికకు కో ఆర్డినేటర్‌, తెలుగు భాషా సాహిత్యాలను గురించి బ్రౌన్‌ వ్రాసిన వ్యాసాలు వెలువరించటం, వేమన పద్యాల విస్తృత ఎడిషన్‌ వెలువడటం.
  • 1840 ఏప్రిల్‌ 7 :సివిల్‌ ఆడిటర్‌ అండ్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ స్టాంప్స్‌గా ఛార్జి తీసుకోవటం.
  • 1841 ఆగస్టు 31 : యాక్టింగు పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌గా నియామకం. ఆలిండియా గ్లాసరికి అనుబంధంగా దక్షిణ భారతంలోని రెవెన్యూ జ్యూడిషియల్‌ పదాల పట్టిక తయారు చేయమని ప్రభుత్వాదేశం, రాఘవాచార్యుల 'నలచక్రవర్తి కథ' - నవనాథ చరిత్ర నుంచి సేకరించి గౌరన హరిశ్చంద్ర కావ్యం, చాలా శతకాలు, సీతాకళ్యాణం, యక్షగానం వగైరా అనతికాలంలో, స్వీయ పర్యవేక్షణ క్రింద అచ్చువేయటం.
  • 1843 సెప్టెంబర్‌: మద్రాసు యూనివర్సిటి బోర్డు యాక్టింగు సెక్రెటరిగా, ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం బ్రౌన్‌ సంపాదకీయ పర్యవేక్షణలో, మద్రాసులోని విద్యాకళాప్రెస్‌ (ఉమాపతి మొదయార్‌ గారి)లో ముద్రితమై వెలువడటం.
  • 1844: ఉచితంగా తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌ నేర్పటానికి పాఠశాల ప్రారంభించటం (కొంతకాలం తర్వాత ఈ పాఠశాల నిర్వహణ బాధ్యతను ఒక క్రైస్తవ పెద్దమనిషికి అప్పగించటం). వసుచరిత్ర వ్యాఖ్యాన సహితంగా అచ్చు వేయటం. బ్రౌన్‌ తన తెలుగు -ఇంగ్లీష్‌ ,ఇంగ్లీష్‌-తెలుగు నిఘంటువులను ఎస్‌.పి.సి.కె.తో ఒడంబడిక కుదుర్చుకొని ముద్రణ ప్రారంభించటం.
  • 1845 జనవరి 27 : మద్రాసు లిటరరీ సొసైటీ వారికి తన సొంత గ్రంథాలయంలోని దేశభాషల్లో 2440 వ్రాతప్రతులు (తాటాకు ప్రతులతో పాటు ) బహూకరించడం.
  • 1846 జూలై 3 :పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌గా పూర్తి బాధ్యతలు స్వీకరించటం, ప్రభుత్వ తెలుగు అనువాదకుడు కావటం.
  • ఆగస్టు 4:ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ సభ్యుడు కావటం.
  • 1847:మద్రాసులో హిందూ క్రైస్తవ తగాదాల ముమ్మరం -బ్రౌన్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌గా బాధ్యతల నిర్వహణ విషయంగా లెనిన్‌ ఆరోపణలు, మద్రాస్‌ 'అట్లాస్‌' ఒక ఆకాశరామన్న వ్యాసం వ్రాశాడని ఆరోపణ వచ్చింది.
  • 1849:హైదరాలీ మరియు మెమోయిర్స్‌ ఆఫ్‌ టిప్పు సుల్తాన్‌ పరిష్కృత పుస్తక ప్రచురణ.
  • 1850 : (1751-1850 )-ఎఫిమిరస్‌ ప్రచురణ -సైక్లిక్‌ టేబిల్స్‌ ఆఫ్‌ హిందూ మహమ్మడన్‌ క్రొనాలజి.
  • 1851 : మనుచరిత్ర వ్యాఖ్యాన సహితంగా ముద్రణ.
  • 1852 మార్చి 29:ఫస్ట్‌క్లాస్‌ సివిల్‌ సర్వీస్‌ హోదా పొందటం , తెలుగు వాచకాలు 3 భాగాలు, జిల్లా నిఘంటువు, వాక్యావళి ప్రచురణ.
  • 1853 : 'రాజుల యుద్ధాలు' మరియు డైలాగులు (2వ ఎడిషన్‌) ప్రచురణ.
  • ఏప్రిల్‌ 16 : మెదడువాపు వ్యాధికి గురికావటం -పక్షవాతం రావడం సెలవుపై నీలగిరిలో విశ్రాంతి. భాషాశాస్త్రవేత్త అయిన మిషనరీ బెర్నాష్డ్‌ష్మిడ్‌ను కలుసుకోవటం అతని తమిళ రచనల పునర్ముద్రణకు ఆర్థికంగా తోడ్పడడం - బెంగుళూరు, మైసూరు -శ్రీరంగపట్నం సందర్శన.
  • 1854: మే 1వ తేదీ నుంచి పదవీ విరమణ చేయటానికి ప్రభుత్వం నుంచి సమ్మతిపొందటం. ఏటా 920 పౌండ్లతో ఉద్యోగ విరమణ. రెండు నిఘంటువులు మిశ్ర భాషా నిఘంటువు ప్రచురణ.
  • 1855 : తాతాచారి కథలు - ప్రచురణ, మిరాశివాదం గ్రంథాన్ని ఇంగ్లీష్‌ తర్జుమాతో ప్రచురించటం.
  • జూన్‌ 1856 : లండన్‌కు ప్రయాణం, ఇండియాలో అచ్చవుతున్న తన తెలుగు వ్యాకరణం (పరివర్ధిత ప్రతి) గ్రంథానికి లండన్‌లో పీఠిక వ్రాసి మద్రాసుకు పోస్ట్‌ ద్వారా పంపటం, తెలుగు వ్యాకరణం మలిముద్రణ వెలువడటం.
  • 1859 : నికోలస్‌ అనుభవం ముద్రణ.
  • 1860: భారతదేశంలో 1857 తిరుగుబాటు గురించి 12 పట్టణాల్లో ఉపన్యాసాలివ్వటం.మళ్ళీ తెలుగు అధ్యయనం, మద్రాస్‌ నుంచి వెలువడే అధునాతన పుస్తకాల పరిశీలన - తెలుగు సాహిత్యంలోని ఆధునిక పోకడలతో పరిచయం.
  • 1863 : కర్నాటిక్‌ క్రనాలజి ప్రచురణ (సైక్లిక్‌టేబిల్స్‌ - సవరింపబడిన ప్రతి).
  • 1865: లండన్‌ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్‌ కావటం.
  • 1866: బ్రౌన్‌ తన ఆత్మకథను ప్రైవేట్‌ సర్కులేషన్‌ కోసం ముద్రించటం .
  • 1869 : ఐ.సి.యస్‌.పరీక్షలకు తెలుగు పరీక్షాధికారిగా నియుక్తుడు కావటంః గోల్డ్‌ స్టకర్‌ ఒత్తిడిపై 'సంస్కృత ఛందస్సు' అనే తన గ్రంథాన్ని సవరించి వెలువరించటం.తెలుగు వ్యాకరణం ఇంకోసారి సవరించటం, నవంబర్‌లో మూడో ఎడిషన్‌ ముద్రణకు ప్రతిని సిద్ధపరచటం. ప్రతిదినం తన నిఘంటువులలో విస్తృతంగా చేర్పులను, మార్పులను (ఇంటర్‌ లీవ్‌ చేసిన ప్రతులతో) కావిస్తూ బాగా పెంచటం.
  • 1871 : బ్రౌన్‌ వ్యాసాలు రెండు రాయల్‌ ఏసియాటిక్‌ జర్నల్‌లో ప్రచురణ.
  • 1872 : సవరించిన 'ఆత్మకథ' ప్రచురణ.
  • 1884 నవంబర్‌ 3 : వీలునామా తయారు.
  • 1884 డిసెంబర్‌ 12 : అస్తమయం.
  • 1885 మార్చి 3 : వీలునామాలో పేర్కొన్నట్లు బ్రౌన్‌ వ్రాతప్రతుల గ్రంథభాండగారం కొన్ని ప్రైవేట్‌ పత్రాలు లండన్‌లోని ఇండియన్‌ ఓరియంటల్‌ లైబ్రరీకి అప్పగింత.

 
satta king tw